ఒక ఐడియా / ఒక ఆలోచన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
అలాంటిదే ఈ ఆలోచన. నా జీవితం లో చాల మలుపు తెప్పిన సంగటన.
దాదాపు 2 సంవస్తరాల క్రింద నేను mca చేసి హైదరాబాద్ లో ప్రాజెక్ట్ చేయటానికి వచినప్పుడు జరిగిన సంగటన. తొందరపడి నట్లితే ఈపాటికి చనిపోఇ ఉండేవాడిని.
అందుకే నా తెలివి కి ఉద్యోగం రాదు. నాకు ఇష్టం ఐన ఫీల్డ్ లో ఇంట్లో వాళ్ళు వప్పుకోరు అని జాబ్స్ ట్రై చేసి నిరుస్తాహం తో చనిపోవాలని అనుకున్నాను. కానీ నాకు ఒక ఆలోచన గుర్తుకు వచ్చింది. ఎలాగో నేను చనిపోతున్నాను కనీసం నా అవయవాలు దానం చేస్డం అనుకున్నాను. అందుకు మోహన్ ఫౌండేషన్ వాళ్ళ కు నా అవయవాలు దానం చేస్తున్నట్లు రాసి ఒక కార్డు కూడా తెసుకున్నాను.
నా ఆత్మహత్య కు ప్లాన్ గీసుకున్నాను.
నా ప్లాన్:
- ట్రైన్ క్రింద పది దూకి చనిపోధం అనుకున్నాను కానీ అన్ని అవయవాలు నలిగి పనికిరాకుండా పోతాయే అని రద్దు చేసుకున్నాను
- పురుగుల మందు తెసుకొని చనిపోడం అని అనుకున్నాను. కానీ కళ్ళు తో సహా అన్ని అవయవాలు poision ఎక్కి పనికిరాకుండా పోతాయే అని దానిని కూడా వద్దు అనుకున్నాను
- నిద్ర మాత్రలు తెసుకొని చనిపోడం అని అనుకున్నాను కానీ ఏ మెడికల్ షాప్ లో అడిగిన ఇవ్వలేదు. నిజమే లే అవి అందరికి అందుబాటు లో ఉంటె ఈపాటికి ఎంతోమంది చనిపోయే వారు కదా.
- buidling ఎక్కి దుకుడం అనుకున్నాను. అదే బెటర్ అని అది హాస్పిటల్ ఫై నుండి దూకితే బెటర్ ఇంకా చనిపోకముందే నేను బ్రెయిన్ death లో ఉన్నప్పుడు న ఆర్గాన్ donations అన్ని తెసుకుంటారు అని. దగ్గరలోని ఇమేజ్ హాస్పిటల్ లో కి వెళ్ళాను కానీ బిల్డింగ్ ఫై కి ఎక్కాను కానీ దిర్యెం చాలలేదు దాదాపు గంట పైగా అక్కడే ఉన్నాను. అంతలోకి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి హిందీ లో క్రిందకు దెగు అన్నాడు. సరే అని దిగాను.
- నాకు ఇష్టం ఐన ప్రదేశాలు తెరిగి సంతోషం గ చనిపోడం అనుకున్నాను. అందుకు హైదరాబాద్ లో ఉండే బిర్ల మందిర్ tankbund రామకృష్ణ మతం. ఒకరోజు చార్మినార్ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఒక రోజు చివరగా గోల్కొండ కోట తెరిగి మేహది పట్నం కు వచాను. అక్కడ flyover (అప్పుడే తాయారు అవుతుంది మెహదిపట్నం నుండి shamshabad airport కు flyover ) దానిపికి ఎక్కి troffic జంక్షన్. (ఆసిఫ్ నగర్ ) లో దూకితే పక్కనే సరోజినీ దేవి హాస్పిటల్ కాబట్టి అన్ని కళ్ళు కూడా దొనతె చేయవచు అని దుకుడం అని అక్కడకు వెళ్ళిన తర్వాత నేను నా organdonation కార్డు మరచిపోయాను . అది ఉంటేనే న organs తెసుకుంటారు అని. మరొక రోజు వాయేద పడింది.
- నాకు విసుకు ఎక్కింది రోజు ఇలా వఏద వసుకోవటం ఏమిటి ఈ రోజు ఎలాగిన చనిపోడం అని మేహది పట్నం లో ఆ ఫ్ల్యోవేర్ దగ్గర అక్కడే ఉంటె అంతలోకి ప్రక్కన ఒక కొండ కనబడింది (dattatreya colony అది )దానిమేధకు వెళ్లి చసేం అనుకున్నాను. ఎలాగా చేనిపోతున్నాం కదా అని అంట డబ్బులు ఖర్చుపెట్టేసను. ఒకవేళ కొద మెడ నుండి దూకటానికి చావటానికి దిర్యం చాలకపోతే మరొక ప్రాసెస్ కత్తి తెసుకొని మెడ మెడ కుడి విపు ఒక రక్త నాలం ఉంటుంది. అది కట్ ఐతే బ్రతకటం చాల కష్టం ఎందుకనగా నేత్ర దానం తర్వాత ఆ సెర లో రక్తం 8 గంటల వరకు ఉంటుంది. అదే మెదడుకు రక్తాన్ని తెసుకు వెళ్ళేది. కట్టి తో ఆ సిరను కట్ చేద్దాం అనుకున్నాను. అందుకు ఒక కత్తి కొనుక్కొని కొండ మీద కు వెళ్ళాను.
- ఎప్పటి లాగా నే అందుకు అక్కడకు వెళితే ధైర్యం చాలలేదు . కత్తి తెసుకొని బొడ్డు దగ్గర పెట్టుకొన్నాను.కదా కొండ మెట్ల మీద పైకి ఎక్కుతుంటే ఆ కట్టి నా పొట్టకి గుర్చుకుంది. కొంచం అబ్బ అంటూ అక్కడే పడిపోయాను. కాసేపు కూర్చొని పైకి ఎక్కాను. ఒక్క చిన్ని కత్తిగాటు కి ఇంత బాధ పడతునం అది గట్టిగ గుర్చుకుంటే ఎంత నరకమో తలుచుకున్తుంటేనే భయం వేస్తుంది.. పైకి ఎక్కి ఆలోచించాను. ఆలోచించాను. 4 గంటలనుండి ఆలోచిస్తుంటే గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నవి .
- నా జీవితం లో రెండోసారి ఇలా ఆత్మహత్య కు పల్పడుతున్నాను (ఒకసారి చెన్నై లో mca చదవటానికి వెళ్ళిన క్రోతలో లోకల్ ట్రైన్ లో టికెట్ తెసుకొని ఫస్ట్ క్లాసు box లో ఎక్కినప్పుడు TC నా దగ్గర ఫైన్ అడిగాడు నాదగ్గర లేవు తెలియక ఎక్కాను అంటే ఊరుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేయమన్నాడు. వచ్చి రెండు రోజులు కూడా కాలేదు కనుక ఎవ్వరి ఫోన్ నుంబెర్స్ తెలియదు. అతని అనుమతి తెసుకోకుండా మా ఇంటికి ఆంధ్ర కు ఫోన్ చేస్తే (అతను లోకల్ ఫోన్ చేసుకోమని అంటే )అతనికి కోపం ఎక్కి నా premission తెసుకోనుండా std కి చేస్తావ అని తెసుకొని వెళ్లి అక్కడ లోపల tc ఆఫీసు రూం లో ఒక రూం లో కూర్చోబెట్టాడు. అది జైలు లాగా ఉంది. గంట సేపు కుర్చోబెట్టే మల్లి వచ్చి బూట్ తో కొడుతుంటే నాకు విరక్తి పుట్టి నా జీవితం లో ఎప్పటికి జైలు లో కి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇలా వేల్లవలిసి వచ్చింది అని విరక్తి పుట్టి చనిపోడం అని ప్రక్కన కరెంటు కనెక్షన్ plug ఉంటె దానిలో చై పెట్టి ఆత్మహత్య కు ప్రయత్నించాను అందుకు tc తర్వాత వదిలిపెట్టారు. )
- నాకు ఆ మొదటి ఆత్మహత్య చాల సిల్లి గ అనిపించింది అరె 20 రూపాయల సూపర్ టికెట్ విషయం లో ఇంట చిన్ని విషయానికి ఇంతుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాన? అని ... ఇలా గత జ్ఞాపకాలు అన్ని గుర్చుకు తెచుకున్నాను .ఇలాంటి జ్ఞాపకాలలో కొన్ని చెడు జ్ఞాపకాలు చెడు ఆలోచనలు కూడా వచాయి. ఎలాగో చనిపోతున్నాము ఒక చెడు వ్యక్తి కి రౌడీ కానీ గుండా కానీ చంపి నేను చస్తే సమాజానికి ఒక మంచి పని చేసినవాడిని అవుతాను కదా . అనే ఆలోచన వచ్హినా అరె ఒక చిన్న పిల్లవాడికి సుది గుర్చితే నా గుండెల్లో గునపం దిగినంత బాధపడే నేను హత్య చేయటమ నాకు అంట ధైర్యం లేదు ఎందుకనగా నన్ను నేను చంపుకోవటానికి జూలై చివరి నుండి ఈరోజు ఆగష్టు 13 వరకు ఐనది ఇంకా చావలేదు అలాంటిది నేను ఒకరిని చంపుతమా? అని ఆ ఆలోచన విరమించుకున్నాను.
- సృష్టి లో ఎ జీవి ఆత్మహత్య చేసుకోదు మరి అసలు మనిసి మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? అనే ఆలోచన వచ్చింది. అసలు వాయిద ఎందుకు ఎలాగైన చనిపోతము కదా అని ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది . ఎక్కడో విన్నాను. నువ్వు ఎ పని చేసిన దిర్యం గ గర్వం గ పదిమందికి చెప్పుకొని గర్వం గ చెఈఎ అని (ఏదో సీరియల్ లో లేచిపోయే పెళ్ళిచేసుకుంటే ఒక పెద్ద మనిసి అన్నట్లు గుర్తు ) నేను గర్వం గా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని గర్వం గ చెప్పగలన ?
అని సాయంత్రం ఆరు నుండి 9 వరకు ఆలోచనలు ఆ టైం లో మరో ఆలోచన ఒక రోజు నేను రక్తదానం చేస్తే నిమ్స్ లో వాళ్ళు సంతోషానికి ఆనందం కు అవధులు లేవు ఆ ఆనంద బస్పలు ఇప్పటికి మరచిపోలేను. (శ్రీ లత age 6 హార్ట్ లో రంద్రం ఉన్నది ఆపరేషన్ కోసం ) ఒక మనిసి తన జీవితం లో 200 సార్లు రక్తదానం చేయవచు . నేను ఇప్పటికి మొన్న 13 సార్లు రక్తదానం చేసి 13 మందిని కపాదేనే అలాంటిది ఒక సంవస్తరం వాయిద వేస్తె మరొక నలుగురు శ్రీలత లను కాపాడవాచు కదా అని ఆలోచన . అరె నేను ఇప్పుడు చనిపోతే మరో నలుగురు శ్రీ లతా లు చనిపోతారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు మంచిపని ఐతే ఇప్పుడే చెఈఎ చెడు పని ఐతే తర్వాత చైఇఎ అని ఆ ఆలోచన తో ఆత్మహత్య విసయాన్ని వాయిద వేసుకున్నను .. పైగా ఆత్మహత్య తర్వాత ఐన చేసుకోవచు ఇది చెడు పని కాబట్టి వాయిద వేసుకున్నాను.
కానీ మరొక ప్రాబ్లం వచ్చింది ఎలా చనిపోతున్నాము కదా అని అన్ని డబ్బులు ఖర్చుపెట్టాను. నాదగ్గర రూపాయే కూడా లేదు . ఎలా ఇంటికి పోవాలో తెలియ లేదు అప్పుడు ఆ గుడి పూజారి ఇది సత్రం కాదు బయటకు వెళ్ళు అన్నాడు ఆ కొండమీద పూజారి. డబ్బులకు ఏమి చేయాలో తెలియలేదు. రాత్రి 10 దాటింది. ఏమి చేయాలో తెలియలేదు ఇక్కడ నుండి ameerpet కు బస్సు లు కూడా తక్కువ అని క్రిందకు దిగి నడచుకుంటూ వెళ్తుంటే ప్రక్కనే ఒక నిర్మాణం లో ఉన్న బిల్డింగ్ ఉంది ఈ రాత్రి కే ఇక్కడ ఉంది రేపు పోదాం అని ఆ బిల్డింగ్ పైకి ఎక్కి నిద్రపోయాను. నిద్ర పోయే సరికి 11 .30 ఐనది . తెల్లారి 6 .30 క్రింద చుస్తే ఆ బిల్డింగ్ కి కాపలా కాసే వాడు అక్కడ ఉన్నాను మూడో బిల్డింగ్ flore నుండి మొదటి అంతస్తు కు దిగి ఆ కపాల కసేవాళ్ళు చుస్తే దొంగ అనుకుంటారు ఏమో అని పక్కనే మరొక ఇంటిలోకి దేగే టందుకు చిన్ని మార్గం ఉంటె దాని మీదగా ప్రక్క ఇంటిలోకి దేగే వెళుతుంటే ఆ ఇంటి owners నన్ను దొంగ గ భావించి నన్ను పట్టుకొని పోలీసు లకు అప్పగించారు.
చ! ఇలాజరిగింది ఏమిటి అని అని నన్ను నేను తెట్టుకున్నాను మాములుగా ఆ బిల్డింగ్ మెడనుండి దేగితే మాములుగా ఉండేది దొంగ లాగా ఒక ఇంటి మెడనుండి మరొక ఇంటి మెడకు దూకితే దొంగ అనుకోక ఏమి అనుకుంటారు అని అనుకుంటుండ గని ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు నన్ను తెసుకొని పోలీసు స్టేషన్ (ఆసిఫ్ నగర్ కు తెసుకువేల్లరు ) కు తేసుకువెళ్ళారు. అక్కడ ఈరోజు ఆగష్టు 14 రేపు స్వతంత్ర పనులకు si ci లు వెళ్లారట రేపు శుక్ర వరం ఎల్లుండు సాని అది వరం శలవులు నాకు బెయిల్ రాదు మర్యాదగా అక్కడకు ఎందుకు వెళ్ళవు అని నన్ను భయపెత్తసగారు నన్ను పక్కన సెల్ లో వేయబోతే నేను వెళ్ళాను అన్నాను. ఎందుకనగా నేను ఎప్పటికి జైలు లో కి వెళ్ళకూడదు అని మనస్పూర్తిగా అనుకున్నాను.
నేను తప్పుచేస్తే జైలు లో కి వెళ్దాం కానీ చేయలేదు కదా అని వెళ్లనని అన్నాను. కానీ హెడ్ కానిస్టేబుల్ బలవంతం చేస్తే అక్కడ కూడా మరొకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాను. నా కత్తి నా బొద్దు లో ఉంది కదా అది గుర్తుకు వచ్చి తెసుకొని మీద మీద పెట్టుకోవటానికి ట్రై చేస్తే ఆ కనిస్తేఅబ్లె అది గమనించి ఆ కత్తి తెసుకొని ప్రక్కన పెట్టి లోపల కూర్చోబెట్టాడు. నన్ను దొంగ అని conform చేసుకున్నారు లేక పొతే కత్తి ఎందుకు మైంతైన్ చేసుకుంటావు అన్నాడు అప్పుడు మా రూం met అన్న ఫ్రెండ్ సుదీర్ కి ఫోన్ చేపించారు. ఆ హెడ్ కానిస్టేబుల్ కు ఇలా ఆత్మహత్య అన్ని విషయాలు చెప్పను. కానీ నమ్మినట్లు లేదు. ఇక్కడ నా దగ్గర watch ను కూడా తేసుకున్నారు వాళ్ళకు మాములు కోసం అనుకుంట .
7 గంటల నుండి 10 గంటలదాకా నన్ను అక్కడే ఉంచారు అంతలోకి మా సుదీర్ అన్నమరియు రాంప్రసాద్ అన్న వచ్చారు 10 .30 కి ci సర్ వచ్చారు మాట్లాడి ఒక లెటర్ వ్రపించుకొని (మరొకసారి వారి ఇంటి పరిసరాలకు వెళ్ళాను అని ) నన్ను ఒదిలి పెట్టారు.
ఇప్పుడు నేను 22 సార్లు రక్తదానం 3 మంది చేత నేత్ర దానం చేపించి జీవితం లో స్తిరపడుటకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాను. జన లోక్పాల్ బిల్ రావటానికి నావంతు పోరాడుతున్నాను. అలాగే పది మందికి చేయూత ఇవ్వాలి అందుకు నేను మంచి ఫీల్డ్ లో స్తేరపడటానికి కృషి చేస్తున్నాను.
కేవలం ఒకే ఆలోచన మంచిపని ఐతే సాద్యమైనంత త్వరగా చేయి . చెడు పని ఐతే సాద్యమైనంత ఆలస్యం గా చేయి . అనే ఆలోచన మరియు రక్తదనమే నా ప్రాణాన్ని కాపాడింది అందుకే నేను నా జీవితాంతం రక్తదానం చేస్తుంటాను.
నా రక్త దానాల కోసం surajyam ను చుడండి .
మీరు ఎవరినా ఆత్మహత్య చేసుకునే పని ఐతే ఆలోచించండి మీరు ఆత్మహత్య చేసుకునే పని ఐతే ఆ సమస్య తెరుతుందా? ఆలోచించండి నా ఆత్మహత్య తో అవినీతి అంతం అవుతుంది అంటే నేను ఇప్పుడే ఆ పని చేస్తాను. కానీ జరుగదు.
ఇప్పుడు చాల మంది అనేక కారణాలతో తెలంగాణా రాలేదు అని ప్రేమించిన వాడు దొరకలేదు అని ఇలా అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి మన స్వతంత్రం టైం లో ఎవరినా స్వతంత్రం రాలేదు అని ఆత్మహత్య చేసుకున్నార? లేదు . బ్రతికి సదిన్చాలేనిది చచ్చి ఏమి సాదిస్తారు? ఏది ఐన బ్రతికి సాదించాలి. నేను బ్తతికి ఇప్పుడు అవినీతి నిర్మూలించాలి అని జన లోక్పాల్ బిల్ కోసం పోరాడుతున్నాను. మనం పడే బాధ మరొకరు (నా తర్వాత తరం ) పడకూడదు అని . అందుకే ఆత్మహత్య వద్దు ఏది ఐన బ్రతికి సాధిస్ధం
ఇట్లు
మీ venu . A+ve 22+ve
i want to donate my body parts after death .
ReplyDeleteBut im just 19 now .
do i eligible for donation of body organs .
If possible please provide me sufficient details to enroll my name .
P.Abhisai
(9494426409)
from ongole